Sunday, May 19, 2024
- Advertisement -

వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి సంప్రదింపులు

- Advertisement -

రాష్ట్రంలో త్వ‌ర‌లోనె వైసీపీ ఖాళీ అవుతుంద‌నె ప్ర‌చారం ఊపందుకుంది. అయితె నంద్యాల‌లో ఓట‌మి చెందినా ఆ పార్టీలోకి వ‌ల‌స‌లు ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి వైసీపీ ఖండువా క‌ప్పుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. అయితే జ‌గ‌న్ నిర్ణ‌యం కోసం వేచి చూస్తున్నారు.

కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇప్పుడు త‌న భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని వైసీపీలోకి వ‌చ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పూర్తిగా క‌నుమ‌రుగు అయ్యింద‌నె చెప్పాలి. భ‌విష్య‌త్తులో కోలుకోలేని ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో ఇక వైసీపీలో చేర‌డ‌మే క‌రెక్ట్ అన్న యోచ‌న‌లో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తో ఆమె సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే ఇక్క‌డ టీడీపీ పుంజుకోవ‌డంతో ధర్మాన వంటి నేతలు వైసీపీలోకి మారిపోయారు. అప్పటినుంచి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలే జిల్లాలో పార్టీకి దిక్సూచిగా వ్యవహరిస్తున్నారు. గ‌తంలోనె ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ను వీడిన రోజుల్లోనే కిల్లి కృపారాణి కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ వార్త‌ల‌కు పుల్‌స్టాప్ ప‌డింది.

చాలారోజుల తర్వాత కృపారాణి వైసీపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం మళ్లీ జోరందుకుంది. వైసీపీలోకి వెళ్లాలంటే జగన్ నుంచి కచ్చితమైన హామి రావాల్సిందేనని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. సీటు విషయం పక్కా అయితేనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. సీటు విష‌యంలో త‌ర్జ‌నా భ‌ర్జ‌నా ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

టెక్కలి నిజయోవకర్గంతో తనకున్న అనుబంధం రీత్యా ఆ సీటు తనకివ్వాలని కృపారాణి జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ తరుపున ఇప్పటికే ఇద్దరు నియోజకవర్గ ఇన్ చార్జీలు అక్కడ ఉండటంతో.. వేరే స్థానం గురించి ఆలోచించాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. జగన్ సూచనతో తన సామాజికవర్గం బలంగా ఉన్న పలాసా నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని కృపారాణి భావిస్తున్నారట. డీల్ కుదిరిన‌ట్లేన‌ని త్వ‌ర‌లో వైకాపాలో చేర‌డం మాత్రం ఖాయమంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -