టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే అందరు ఠక్కున అనుష్క పేరే చెబుతారు.అభిమానులు ముద్దుగా స్వీటి అని పిలుచుకుంటారు.లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు ఆమె తప్ప మరెవ్వరు చేయరు అనే విధాంగా నటిస్తుంది. ‘అరుంధతి’ .. ‘రుద్రమదేవి’ .. ‘భాగమతి’ వంటి సినిమాలు అవి సాధించిన విజయాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. భాగమతి సినిమా తరువాత ఇప్పటికి వరకు మరో సినిమా అంగీకరించలేదు అనుష్క.
తాజాగా ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను నూతన దర్శకుడు హేమంత్ వినిపించడంతో ఆమె అంగీకరించినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో అనుష్క సరసన మాధవన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అనుష్క కోసమే లేడీ ఓరియెంటెడ్ కథలు మరో రెండు రెడీ అవుతున్నట్టుగా సమాచారం. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.