Saturday, May 18, 2024
- Advertisement -

తన మేనేజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్

- Advertisement -

టాలీవుడ్ లో డ్రగ్స్ విషయం రోజుకొక కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ మేనేజర్ రోనీ.. తాజా గంజాయి కేసు విషయంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంపై కాజల్ స్పందించింది. గంజాయి రోనీ అరెస్ట్ అని తెలిసి షాక్ అయ్యానని తెలిపింది. సమాజానికి హాని చేసే.. వ్యక్తులకు తన మద్దతు ఉండదని తెలిపింది.

మత్తు పదార్ధాలకు అలవాటు పడిన వారికి.. తన మద్దతు ఎప్పుడు ఉండదని తెలిపింది. తన దగ్గర పని చేసే వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపిస్తానని.. అలా అని వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను తాను నియంత్రించలేనని ఆమె అన్నారు. వృతి పరంగా మాత్రం.. తమ వద్ద పనిచేసే వారికి మంచి సంబంధం ఉందని అన్నారు. అయితే తమ వద్దనుండి పని చేసి వెళ్లిన వారు.. తర్వాత ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయాలు తాను పట్టించుకోను అని కాజల్ స్పష్టం చేసింది.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు చార్మితో జరగబోయే విచారణలో మరికొన్ని షాకింగ్ నిజాలు బయటపడుతాయి అని అధికారు అంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖలను కొందరిని విచారించగా.. వారు మరికొంతమంది పేర్లు బయటకు చెప్పినట్లు సిట్ అధికరులు సూచించారు. అలా బయటలు వచ్చిన వారికి కూడా సిట్ అధికార్లు నోటిసులు పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -