- Advertisement -

ఉప ఎన్నిక‌లో ఏపార్టీ గెలిస్తె ఆపార్టీతో పొత్తు….

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష‌పార్టీలు కుస్తీ ప‌డుతుంటె ప‌వ‌న్ మాత్రం తాపీగా ఉన్నారు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌నిగాని.. మ‌ద్ద‌తు ఇస్తామ‌నిగాని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌ని విష‌యం తెలిసిందే. ఉప ఎన్నిక ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు ప‌వ‌న్ వేచి చూస్తున్నారంట‌.
నంద్యాల ఉపఎన్నికకు, పవన్ కు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా? రాబోయే ఎన్నికలో కూడా పవన్ కింగ్ మేకర్ అవుతారని ఇటు టిడిపి అటు వైసీపీలు అనుకుంటున్న సంగతి తెలిసిందే . అందుకనే తమతోనే చేతులు కలపాలని వైసీపీ తరపున ప్రశాంత్ కిషోర్ పవన్ తో దోస్తీకి జగన్ తరపున రాయబారం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. త‌మ‌తోనె అట్టిపెట్టుకోవాల‌ని బాబు తాపాయ‌త్ర‌ప‌డుతున్నారు.
పార్టీల పరిస్ధితినే పవన్ అవకాశంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రెండింటిలో ఏ పార్టీవైపు వెళ్ళాలన్న మీమాంశలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తన సందిగ్దత తొలగాలంటే నంద్యాల ఉపఎన్నికనే మార్గంగా పవన్ యోచిస్తున్నారు. ఉపఎన్నికలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఎలాగుంటుందన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు కనబడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -