Saturday, May 18, 2024
- Advertisement -

త‌మ‌న్నా పెళ్లి ఫిక్స్?

- Advertisement -

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంద‌నే వార్తలు విన‌బ‌డుతున్నాయి.త‌మ‌న్నా పెళ్లి చేసుకుంటుంద‌ని గ‌తంలో కూడా వార్త‌లు వ‌చ్చిన వాటిని ఖండించి సినిమాలు చేసింది.అయితే ఇప్పుడు మాత్రం అమ్మడు పెళ్లికి సిద్ధమవుతుందని సమాచారం. పెళ్లికొడుకు కూడా రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. త్వరలోనే నిశ్చితార్ధం జరిపించబోతున్నారని టాక్. త‌మ‌న్నా అమెరికాలో డాక్ట‌ర్‌గా సెటిల్ అయిన వ్య‌క్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంద‌ని తెలుస్తుంది.

వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపార‌ని స‌మాచారం.రెండు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చే ముహూర్తం చూసుకుని ముందుగా ఎంగేజ్మెంట్ నిర్వహించి ఆ తరువాత పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు.త‌మ‌న్నా పెళ్లి త‌రువాత కూడా సినిమాల‌లో న‌టించ‌డానికే మొగ్గు చూపుతుంద‌ని స‌మాచారం.కాబోయే భ‌ర్త‌తో ఎక్కువ స‌మయం గ‌డ‌ప‌డం కోసం ఆమె సినిమాలు ఏవీ ఒప్పుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు త‌మ‌న్నా స‌న్నిహితులు.మ‌రి పెళ్లి వార్త‌ల‌పై త‌మ‌న్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -