Friday, May 3, 2024
- Advertisement -

పోట్లాటకు దిగారు బాలీవుడ్ భామలు..!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోకు, మరో హీరోకు, అలాగే ఒక హీరోయిన్ తో మరో హీరోయిన్ కు పడదు. సినిమాలో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి కామన్. కానీ తాజాగా ఓ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లు ఏకంగా కొట్టుకోవడం సెన్సేషన్ గా మారింది. జుట్టుపట్టుకొని అందరి మధ్యన.. అది కూడా ఓ సినిమా కోసం కొట్టుకోవడం బాలీవుడ్ లో అందరికి షాకిచ్చింది.

ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇలా ఇద్దరు హీరోయిన్లు కొట్టుకుంటుంటే.. హీరో మాత్రం అంతా షూట్ చేసి తన ట్విట్టర్ అకౌంట్ లో వీడియోలు ట్వీట్ చేశాడు. ఇదంతా ఏ సినిమా కోసం అనుకుంటున్నారా..?

అక్షయ్ కుమార్ తాజా సినిమా హౌజ్ ఫుల్3 సినిమా ప్రమోషన్ లో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లీసా హెడెన్ లు చేసిన వెరైటే ప్రమోషన్. మామూలుగా ప్రమోషన్ అంటే ఏదో అలా వచ్చి నాలుగు మాటలు మాట్లాడి పోవడం కాకుండా ఏకంగా పోట్లాటకు దిగారు బాలీవుడ్ భామలు. అభిమానులు చూస్తుండగానే జట్టు పట్టుకొని.. నానా హంగామా చేశారు. ఏం జరుగుతుందో తేరుకునేలోపే నవ్వుకుంటు అక్కడి నుండి వెళ్లిపోయారు. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అభిషేక్ బచ్చన్, నర్గిస్ ఫక్రి, రితేశ్ దేశ్ ముఖ్, లీసా హేడున్ లు హౌజ్ ఫుల్ 3లో నటించారు. ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -