Monday, May 20, 2024
- Advertisement -

బాహుబలి సినిమాకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..?

- Advertisement -

ఎన్టీఆర్ సినిమాకి బాహుబలి సినిమాకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? చెప్తా.. గత ఏడాది వచ్చిన బాహుబలి సినిమా ఏలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ చిత్రం లో ప్రభాస్ రానా లు అన్నదమ్ములు గా అలాగే హీరోగా ప్రభాస్, విలన్‍గా రానా అద్భుతంగా నటించారు. ఇక ఈ చిత్ర కథ విషయాన్నికి వస్తే బాహుబలి భార్య రానా దగ్గర బందించబడి ఉంటుంది.

అనుష్కను ఎలాగైన అక్కడ నుంచి విడిపించాలి అని వేరే రాజ్యం అయిన తమన్నా ప్రత్నిస్తుంది. అప్పటికే తమన్నా ను ప్రేమించిన శివుడు(ప్రభాస్) అనుష్కను నేను తీసుకొస్తాను అని అక్కడ నుంచి అనుష్కను విడిపిస్తాడు. ఆ తర్వాత అనుష్క శివుడి(ప్రభాస్) తల్లి అని కట్టాప్ప చెప్పాడం తో ఆ తర్వాత వచ్చే ప్లాష్‍బ్యాక్ తో సినిమా ముగుస్తుంది. మరి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలి అంటే బాహుబలి 2 చూడాలి. అయితే ఈ చిత్రం లో రానా యొక్క భారీ విగ్రహాం ప్రతిష్టించే సీన్ ఉంటుంది.

ఆ భారీ విగ్రహాం మరి బాహుబలి 2 లో శివుడు(ప్రభాస్) అతనికి అతని తల్లికి జరిగిన మోసం గురించి తెలుసుకోని చివరికి రానా ని అంతం చేయడంతో పాటు, ఆ భారీ విగ్రహాంను కూడా నశనం చేస్తాడు. ఇలాంటి సీన్స్‌తోనే అప్పట్లోనే 1978 లో ఎన్టీఆర్ నటించిన సింహ బలుడు అనే సినిమా చూస్తే ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ సన్నీ వేశాలు అచ్చు మనం బాహుబలి 2 లో ఎలాంటి సన్నీవేశాలు ఉంటాయో ముందే చూసినట్లు ఉంటుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా విలన్ యొక్క భారీ విగ్రహాన్ని ద్వంసం చేయడంతో పాటు విలన్‌ అంతం చేస్తాడు. సో ఇది బాహుబలి కి ఎన్టీఆర్ సినిమాకి సంబంధం. మరి బాహుబలి 2 లో ప్రభాస్ రానా యొక్క భారీ విగ్రహాన్ని ద్వంసం చేస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -