Sunday, April 28, 2024
- Advertisement -

షాకింగ్..దేవర ఓటీటీ రేటు ఎంతో తెలుసా?

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. అయితే రీసెంట్‌గా ఆచార్య ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న కొరటాలకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం. అందుకే ప్రతీ సన్నివేశాన్ని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట.

2024 ఏప్రిల్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరో, హీరోయిన్, విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన రాగా ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరగుగుతోంది.

ఇక సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ కాగా తాజాగా ఓటీటీ రైట్స్‌ని భారీ ధరకు దక్కించుకుంది ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఏకంగా రూ.40 కోట్లకు దేవర స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసింది. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో పోటీ పడినా నెట్ ఫ్లిక్స్‌ అధిక ధరకు దక్కించుకోవడం విశేషం.

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా మలుస్తానని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించగా ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -