Tuesday, May 21, 2024
- Advertisement -

బాబు అవినీతిపై వైసీపీ మోత మోగిస్తే!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత వివిధ రూపాల్లో ఆ సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బాబుతో నేను అనే కార్యక్రమాన్ని ఏపీ వ్యాప్తంగా చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్,అసెంబ్లీ వేదికగా ఆందోళనలు, క్యాండిల్ ర్యాలీలు నిర్వహించింది. ఇక క్యాండిల్ ర్యాలీలో చంద్రబాబు సతిమణి భువనేశ్వరితో పాటు లోకేష్ సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు.

అయితే తాజాగా లోకేష్ అరెస్ట్‌కు అక్టోబర్ 4 వరకు బ్రేక్ పడినా ఆ తర్వాత ఏ క్షణమైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో కార్యాచరణకు పిలుపునిచ్చారు టీడీపీ నేతలు లోకేష్, బ్రాహ్మణి. రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని చెప్పారు. ఇంట్లోనో, ఆఫీసులోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలని చెప్పారు.

దీంతో టీడీపీ నేతల పిలుపుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. చేసిందే అవినీతి…ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటే ప్రజలను ఇబ్బందిపెట్టే ఈ పనులేంటని జనం మండిపడుతున్నారు. ఇక వైసీపీ నేతలైతే ఏకంగా చంద్రబాబు అవినీతిపై తాము డప్పు మోగిస్తే టీడీపీ నేతల పునాదులు కదిలిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు టీడీపీ చేపట్టిన ఆందోళనలకు ప్రజల మద్దతు లభించకపోవడంతోనే ఇలా ప్రజావ్యతిరేక ఆందోళన నిర్ణయాలను తీసుకుంటున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టీడీపీ చేపట్టిన ఈ ఆందోళన కూడా ఫెయిల్‌ అయితే మరెన్ని దారుణ నిర్ణయాలకు ఒడిగడతారోనని మరికొంతమంది చెబుతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -