Friday, April 26, 2024
- Advertisement -

వామ్మో.. నాని సినిమాకు ఇంత డిమాండా..?

- Advertisement -

“అష్టాచ‌మ్మా” అంటూ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత విభిన్న‌మైన క‌థ‌లు.. అద్భుత‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు నాని. త‌న‌దైన స్ట‌యిల్ లో న‌టిస్తూ నాచుర‌ల్ స్టార్ గా మ‌స్తు క్రేజ్ సంపాదించుకున్నాడు నాని. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీబిజీగా ముందుకు సాగుతున్నాడు. ప‌ల్లే వాతావ‌ర‌ణం.. స్టైయిల్ లుక్‌.. ఫ్యామీలీ క‌లయిక‌ల‌తో “ట‌క్ జ‌గ‌దీశ్” అంటు అద‌ర‌గొట్టేశాడు.

ఇక తాజాగా నాని న‌టిస్తున్న 27వ చిత్రం “శ్యామ్ సింగ‌రాయ్” చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న ఆ పోస్ట‌ర్‌కు “పేరు శ్యామ్‌.. పూర్తి పేరు” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న సినిమా లాక్ డౌన్ లేక‌పోతే.. పోయిన యేడు డిసెంబ‌ర్ లోనే విడుద‌ల కావాలి. పాతకాలం కలకత్తా నేపథ్యంలో ఈ సినిమాను తియ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా కలకత్తాలో భారీ షెడ్యూల్ షూట్ చేయనున్నార‌ని స‌మ‌చారం. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్స్ న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. ట్యాక్సీవాలా సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు ప్రముఖ ఓటీటీల నుంచి, ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల నుంచి భారీగా పోటీ నెలకున్నట్లు సమాచారం. శ్యామ్ సింగరాయ్ సినిమా నిర్మాతలు నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 30 కోట్ల రూపాయలు ఆశిస్తుండగా జీ5, హాట్ స్టార్ ఈ హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనితో నాని రేంజ్ స్టార్ హీరోల రేంజ్ కు తక్కువ కాదని చెప్పవచ్చు.

మరోసారి తన మంచి మనసును చాటుకున్న సోనూ సూద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -