Thursday, April 25, 2024
- Advertisement -

మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

- Advertisement -

‘దేవదాస్’ చిత్రంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో కోటి రూపాలయ పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో అగ్ర నటులందరి సరనన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఛాన్సులు రావడంతో.. అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది.

ఇలియానా కోసం అప్పట్లో టాలీవుడ్ నిర్మాతలు ఖరీదైన హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసేవారు. అంతే కాకుండ అసిస్టెంట్ లకు కూడా ఖరీదైన రూమ్లు, అలోవెన్స్ లు కూడా బారిగనే ఇచ్చేవారట. టాలీవుడ్ లో ఇంత క్రేజ్ ను వదిలేసి బాలీవుడ్ వెళ్లి అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. అప్పుడే విదేశీయుడితో ప్రేమలో పడి డేటింగ్ మొదలుపెట్టింది ఈ గోవా బ్యూటీ.

అయితే అతన్ని పెళ్లి చేసుకోవలనుకున్న ఇలియానా కలలు.. కలలుగానే మిగిలిపోయాయి. అతను మోసం చేసాడని తెలుసుకున్న ఇలియానా డిప్రెషన్ కు వెళ్లిపోవడం, బాగా లావు అవ్వడం, అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇలియానా ప్రేమలో పడిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఓ బాలీవుడ్ స్టార్ తో ఇలియానా కొద్దిరోజులుగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారైనా ఇలియానా ప్రేమ వ్యవహారం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి..!

Also Read: వామ్మో.. నాని సినిమాకు ఇంత డిమాండా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -