Thursday, May 2, 2024
- Advertisement -

వైసీపీ లోకి హైపర్ ఆది..? నిజం ఏంతో..?

- Advertisement -

హైపర్ ఆది.. అభి టీంలో ఒక కమెడీయన్ గా బుల్లితెరకు పరిచయం.. అయిన ఆది.. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ ఏంటో చూపించి.. టీం లీడర్ గా ఎదిగాడు. అయితే ఆది టీం లీడర్ గా ఎదిగిన తర్వాత.. జబర్ధస్త్ కు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఆదికి జబర్ధస్త్.. ఏ టీం లీడర్ కి ఇవ్వని రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆది వేసే పంచులు.. డైలాగులకు ఓ రెంజ్ క్రేజ్ ఉంది.

అయితే ఆది తన పంచులతో నవ్వించడమే కాకుండా.. టైమింగ్ పంచులతో ఎవరినైన పొగడగలడు. ఇటివలే జబర్దస్త్ జడ్జ్, వైసీపీ ఎమ్మెల్యే రోజాను తాటి చెట్టు ఎక్కించాడు. జబర్ధస్త్ తో జడ్జిగా మంచి చేడు చూసే శక్తి.. ఓ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న వారు చేసే ఆరచకాన్ని గుర్తించి నిలదీసే యుక్తి.. రచ్చబండలాంటి షోతో కాపురలు నిలబట్టే దియుక్తి రోజాకే ఉన్నాయని అన్నాడు. కుటుంబాలను నిలబెడుతూ.. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళ మీరేనంటూ రోజాను పొగడ్తలతో ముంచెత్తాడు. రోజా.. జబర్ధస్త్ జడ్జ్.. కాబట్టి హైపర్ ఆది అంతలా పోగిడాడని అనుకోవచ్చు కానీ.. దీని వెనక ఆది పెద్ద ప్లాన్ వేశాడని అంటున్నారు. ఆది స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా అక్కడ నుంచి పోటీ చేయాలని ఆది ఈ హంగామా చేశాడని.. చర్చించుకుంటున్నారు. ఇందుకోసం జగన్ వద్ద రోజా రికమండేషన్ ద్వారా ఈ సీటు కొట్టేయాలని ఆది ఈ ప్లాన్ చేశాడని కొందరు అంటున్నారు. ఈ విషయంపై ఆదిని అడిగితే.. అదంత అబద్ధం.. ఎవరో కావాలని.. ఇలా చేస్తున్నారు.. అందులో నిజం లేదని ఆది సరదాగా కొట్టేపారేశాడు.

https://www.youtube.com/watch?v=FZvmXZzlTvk

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -