Wednesday, May 15, 2024
- Advertisement -

అన్ని ఆఫర్స్ లో ఏది బెస్ట్ ఆఫరో తెలుసా..?

- Advertisement -

టెలికాం రంగంలోజియో సంచలనం సృష్టించడంతో.. మిగిత కంపెనీలు కూడా సూపర్ ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. మరి ఆ ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

JIO ఆఫర్స్: జియో ప్రైమ్ మెంబర్ కోసం ప్రత్యేకంగా రూ. 399 ప్లాన్ ప్రకటించింది. 84 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ లో రోజుకు 1GB చొప్పున 84GB అందించనుంది. ధన్ ధనా ధన్ ఆఫర్ రూ.309 ప్లాన్ కాలపరిమితిని 84 రోజుల నుంచి 56 రోజులకు కుదించింది. 56GB డేటాతో.. రోజుకు 1జీబీ డాటా యథాతంగా అందిస్తోంది. అలాగే రూ.509 ప్లాన్ కింద రోజుకు 2జీబీ చొప్పున 56 రోజుల పాటు వాడుకోవచ్చు.

Vodafone ఆఫర్స్ :

ఒడాఫోన్ కూడా జియోకి షాక్ ఇచ్చేందుకు.. రూ.349 రేంజ్‌లో ఓ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ల్యాండ్‌లైన్ కాల్స్ కూడా పూర్తిగా ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకి 1GB చొప్పున…28GB డేటాను అందించనుంది.

Airtel ఆఫర్స్ :

ఎయిర్ టెల్ రూ.399తో రీఛార్జ్ చేసుకునే ఆఫర్స్ ను తీసుకొచ్చింది. దీంతో 84 రోజుల పాటు 84 GB డేటాను అందించనుంది. దీనికి 4G హ్యాండ్ సెట్ తో పాటు4G SIM ఉండాలి. భారీ డేటా వినియోగానికి ఎయిర్టెల్ వినియోగదారులకు రూ .549 తో మరో ప్లాన్ తీసుకొచ్చింది. రోజుకి 2GBతో 3G ,4G నెట్ వర్క్ ఇస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఆఫర్ చేసింది. అయితే, ఈ ఆఫర్ 28 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి 4G హ్యాండ్ సెట్ కలిగిన మొబైల్ ఉండాలి.

IDEA ఆఫర్స్ :

ఐడియా కూడా రూ.399 తో రీచార్జ్ చైసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు అన్ని నెట్ వర్క్ లకు ఉచితంగా 3వేల నిమిషాల వరకు ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1GB తో 70 రోజుల పాటు 70 GB అందించనుంది. అంతేకాదు ఈ రీఛార్జీలో 5శాతాన్ని టాక్ టైమ్ గా ఇవ్వనున్నారు.

BSNL ఆఫర్స్ :

బిఎస్‍ఎన్‍ఎల్ 395 ఆఫర్ తీసుకొచ్చింది. రోజూ 2GB డేటా ఉచితం.. 71 రోజుల వ్యాలిడిటీ. సేమ్ నెట్ వర్క్ లో 3వేల నిమిషాలు, ఇతర నెట్ వర్క్ లకు అయితే 1,800 నిమిషాలు ఫ్రీ. సిక్సర్ 666 ప్యాక్ ఇది. ఏ నెట్ వర్క్ కు అయినా.. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజూ 2GB డేటా ఉచితం. ప్యాక్ వ్యాలిడిటీ 60 రోజులు. ఈ సేవలు 3G నెట్ వర్క్ ద్వారా అందించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -