Friday, March 29, 2024
- Advertisement -

జబర్దస్త్‌ నుంచి హైపర్ ఆది ఔట్.. ఎందుకు ?

- Advertisement -

జబర్దస్త్ షో బుల్లుతెరపై ఓ రెంజ్ లో దూసుకెళ్తోంది. గతంలో చాలా కామెడీ షోస్ వచ్చినప్పటికి జబర్దస్త్ ముందు నిలవలేకపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగు ఛానెల్ లో లోకల్ గాంగ్స్ ప్రోగ్రామ్ సిద్దమై పోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అందులో జడ్జి నాగబాబు, యాంకర్ అనసూయ లు ఆ ప్రోగ్రాంలోకి జంప్ అయినట్లు తెలుస్తోంది.

అయితే జబర్దస్త్ నుంచి ఏఏ టీంలు లోకల్ గ్యాంగ్స్ కు జంపు కొట్టాయనే దానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ప్రధానంగా జబర్దస్త్ టీమ్స్ లో హైపర్ ఆది టీం నెంబర్ వన్ గా దూసుకెళ్తున్న విషయం తెల్సిందే. అయితే హైపర్ ఆదిని లాగేయాలనే లోకల్ గ్యాంగ్స్ మేనేజ్ మెంట్ ప్లాన్ చేస్తోంది. అయితే అందుకు హైపర్ ఆది సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే హైపర్ ఆది టీంలోకి కీలక సభ్యులైన రైజింగ్ రాజు, దొరబాబు మాత్రం తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ తోనే ట్రావెల్ చేస్తమని తేల్చిసినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే హైపర్ ఆది నాగబాబు వెంట నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ షో మొదలై ఇప్పటికే దాదాపు 7 సంవత్సరాలు అయ్యాయి. అయినప్పటికి ఈ షో ద్వారా చాలా మంది కమెడీయన్స్ వచ్చి మంచి సక్సెస్ అయ్యార్.. డబ్బు కూడా బాగా సంపదించారు. సినిమాల్లో కూడా ముఖ్య కమెడియన్స్ గా కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -