Wednesday, May 22, 2024
- Advertisement -

కోటి కోసం.. జబర్ధస్త్ కొంప ముంచిన హైపర్ ఆది ఆది..?

- Advertisement -

హైపర్ ఆది.. అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి సినిమాలో నటించడమే కాకుండా.. ఈ సినిమాలో సూపర్ పంచ్ డైలాగ్స్ కూడా అందించాడు. హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ ను ఈ సినిమా బాగా వాడుకుంటుంది. ఎక్కువ ఆదిని హైలేట్ చూస్తూ.. ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మేడ మీద అబ్బాయితో సంబంధం లేకుండా తమ సినిమాకి డైలాగ్స్ రాయమని కొంతమంది డైరెక్టర్స్ కోరారట. ఓ ప్రముఖ నిర్మాత ఈ విషయంలో ఆదికి ఏకంగా కోటి రూపాయిలు ఆఫర్ చేసినట్లు అతని సన్నిహితులు చెప్తున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు.. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అనే టాక్ విపిస్తోంది. అయితే అరవింద్ ఈ ఆఫర్ ఇచ్చాడో లేదో కానీ.. జబర్ధస్త్ నుంచి మాత్రం త్వరలో తప్పుకుంటున్నానని.. ఆది తన సన్నిహితుల వద్ద చెప్తున్నాడట. సాధ్యమైనంత ఎక్కువ సినిమాలకి మాటలు రాయాలని.. ఎలాగైన సరే డైరెక్టర్ అవ్వాలని టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాడు.

ఇలా మూవీకి మాటలు రాస్తే.. తన తదుపరి సినిమాకి డైరెక్టర్ ఛాన్స్ ఇస్తామని కొందరు నిర్మాతలు ఆఫర్స్ ఇస్తున్నారట. అయితే ఇలాంటి సమయంలోనే కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంతున్న హైపర్ ఆది.. దాంతో ముందుగా జబర్ధస్త్ కి బైబై చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడట. మొత్తానికి ఆది జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పే టైం దగ్గరపడినట్లు జనం చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -