Thursday, May 9, 2024
- Advertisement -

జ‌గ‌న్ పార్టీలోకి వ‌చ్చే మాజీ మంత్రులు వీల్లే…

- Advertisement -

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఏకంగా వ‌ర్క్‌షాప్ పెట్టి మూడు పీల‌తో ఎన్నిక‌ల్లోకి వెల్లాల‌ని పిలుపు నిచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఎలా గెలిచిందో అంద‌రికి తెలిసిందే. ఆ గెలుపుపై బాబును వ్య‌తిరేకించే వాల్ల సంఖ్య పెరిగిపోతోంది. డ‌బ్బు, కుల‌స‌మీక‌ర‌ణాలు, అధికార దుర్వినియోగంతో గెలిచిన టీడీపీకి స‌రైన బుద్దిచెప్పేందుకు మాజీ మంత్రులుగా ప‌నిచేసి రాజ‌కీయంగా ప‌క్క‌కు త‌ప్పుకున్న‌వాల్లు ఇప్పుడు ముందుకు వ‌స్తున్నారు.

గ‌తంలో వైఎస్ వెంట‌నిలిచి, కేంద్ర మంత్రులుగా ప‌నిచేసిన వారంద‌రు నంద్యాల బైపోల్ త‌ర్వాత జ‌గ‌న్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు చూస్తున్నారు. వాల్ల‌ల్లో ముఖ్యంగా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ బ‌య‌ట‌నుంచి బాబుపై పోరాడుతున్నారు. ఇలాంటి వారి వ‌ల్ల ప్ర‌తిప‌క్ష వైసీపీకి లాభం. ఉండవల్లి జగన్ తో చేతులు కలపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా ఆయ‌న మేధ‌స్సు వైకాపాకు ఉప‌యేగ‌ప‌డుతుంది.

కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఎంపీలు అంద‌రూ ఆ పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌ని తేలిపోవ‌డంతో వారంద‌రూ వైకాపా వైపు నిలిచే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా సాయి ప్ర‌తాప్‌, కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి, కావూరి, పురందేశ్వ‌రి, మాగుంట‌, సుబ్బిరామిరెడ్డి, కిల్లి కృపారాణి వారంతా వైకాపా వైపు నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. వీరికి వేరే ప్ర‌త్యామ్నాయం లేదు. చంద్రబాబు గేమ్స్ తో బీజేపీలోకి చేరి కూడా కొంతమందికి ప్రశాంతత లేకుండా పోయింది.

టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలంటె జ‌గ‌న్ కొత్త స్ట్రాట‌జీని అమ‌లు చేయ‌బోతున్నారు. వైసీపీలోకి వ‌చ్చే మాజీ మంత్రులంద‌రిని ఎంపీలుగా పోటీ చేయించాల‌నె భావ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. యువ‌త‌రానికి ఎమ్మెల్యేలుగా అవ‌కాశం ఇచ్చి …సీనియ‌ర్లంద‌రిని ఎంపీలుగా పోటీ చేయించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇది అస‌క్తిక‌రంగా ఉన్నా ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంద‌నేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -