Tuesday, May 21, 2024
- Advertisement -

ఇలియానా ఇంట్లో ఏం చేస్తోంది ?

- Advertisement -

పదేళ్ళ క్రితం ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఇలియానా తన నడుముని నమ్ముకునే టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. తరవాత బాలీవుడ్ లో ఇరగదీస్తాను అంటూ వెళ్లి అక్కడ ఫెయిల్ అయ్యింది పాపం. తరవాత టాలీవుడ్ లో కూడా అవకాశాలు కోల్పోయి అటూ ఇటూ కాకుండా ఛాన్స్ లు లేక కష్టపడుతోంది.చేసిన సినిమాలు చేసినట్లు ఫ్లాఫ్ అవ్వడం నాజూగ్గా ఉందామని బరువు తగ్గితే అసలుకే మోసం జరగడంతో అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి.

తెలుగు వారు పెద్ద మనసు చేసుకుని ఇలియానా నడుం ని మరోసారి మన ప్రేక్షకులను చూపిద్దామని ఒకటి రెండు ఐటెం సాంగ్స్ ఆఫర్స్ తీసుకెళ్తే నో చెప్పి పంపించింది. ఇప్పుడు పాట , పాత్ర రెండూ లేక సైలెంట్ గా ఉంట్లో ఉంటోంది. తన సొంత ప్లేస్ గోవా కి వెళ్ళిపోయి అక్కడే సైలెంట్ గా స్పెండ్ చేస్తోంది ఈ గోవా బ్యూటీ. 

అందాన్ని మైంటైన్ చెయ్యడం కూడా ఇలియానా మానేసింది అంటూ ఇప్పుడు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాగే ఉంటె ఆఫర్లు రావడం చాలా కష్టం. ఒక పక్క తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ , రెజీనా, రాశీ ఖన్నా లాంటి వారు పాగా వేసేసారు ఇక మరి ఇలియానా ఫ్యూచర్ ఏంటో తెలియడం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -