Saturday, April 27, 2024
- Advertisement -

అమెరికా వదిలి రానంటున్న గోవా బ్యూటీ!

- Advertisement -

దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకోవడంతో తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. పోకిరి, జల్సా, కిక్,రాఖీ వంటి హిట్ సినిమాలతో నటించి మెప్పించింది. ఇదే సమయంలో బాలీవుడ్ ఛాన్స్ రావడంతో అక్కడ సత్తాచాటింది ఈ గోవా బ్యూటీ. అయితే తర్వాత సినిమా ఛాన్స్‌లు దక్కకపోవడంతో తన అంద, చందాలకు పదును పెట్టి క్లీవేజ్ షోలతో సోషల్ మీడియాలో యూత్‌ని అట్రాక్ట్ చేస్తూనే ఉంది.

అమెరికాకు చెందిన మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్న ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. ఇక డెలివరీ తర్వాత అమెరికాలోనే సెటిల్ అవ్వాలని భావిస్తోందట ఈ హాట్ భామ. అందుకే సినిమా అవకాశాలు వస్తున్న వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.

తెలుగులో అగ్రహీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ఇలియానా…బాలీవుడ్‌లో మంచి ఛాన్స్‌లతో మెప్పించినా అక్కడ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక తన కెరీర్ డౌన్ ఫాలో అవుతుండగానే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోయింది ఇల్లీ బేబి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -