Friday, May 3, 2024
- Advertisement -

తెలంగాణ గెలుపు..కాంగ్రెస్‌కు ఊతం ఇస్తుందా!

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఒక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా మిజోరాంలో మాత్రం లోకల్ పార్టీలే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించాయి. ఇక ఈ గెలుపుతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు జోష్ వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మూడు ప్రధాన రాష్ట్రాలలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్‌, తెలంగాణలో ఒక్క రాజస్థాన్ మినహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు జోష్ నింపేలా ఫలితాలు ఉన్నాయని వెల్లడించడంంతో హస్తం పార్టీల ఆనంధానికి అవధుల్లేకుండాపోయాయి. ఇక రాజస్థాన్‌లో బీజేపీ నుండి గట్టి పోటీ ఎదురుకాగా కాంగ్రెస్‌ రెండో స్ధానంలో నిలవనుంది.

మూడు కీలక రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకోవడం, కర్ణాటకలో గెలుపు ఖచ్చితంగా కాంగ్రెస్‌కు పాజిటివ్ సంకేతమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సవాళ్లు, ఎదురుదెబ్బలతో ఇన్నాళ్లు పోరాటం జరిపిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఇది బూస్ట్ ఇచ్చే అంశమే. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు ఖచ్చితంగా హస్తం పార్టీకి ఇవి జీవం పోసే రిజల్ట్సేనని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -