Saturday, May 3, 2025
- Advertisement -

ఐటీ దాడులతో సమంత అసలు రూపం బయటకొచ్చిందా!

- Advertisement -

ఐటీ దాడులతో సమంత ఆస్తుల విలువ బయటకు రావడం.. అక్రమ సంపాదన సంగతులు బయటకు రావడం ఎలా ఉన్నా… సమంత తల్లిదండ్రుల్లోని ఆక్రోశం మాత్రం వెల్లడయ్యింది.

ఐటీ అధికారులకు వారు బదులిచ్చిన తీరును చూస్తే… సమంత అభిమానులు కూడా ఇప్పుడు షాక్ అవుతున్నారు. సమంత ఇళ్లపై ఐటీ రైడ్స్ లో భాగంగా.. ఆమెతల్లిదండ్రలున్న ఫ్లాట్ తలుపు కూడా తట్టారు అధికారులు. అయితే వారికి అక్కడ నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది. తమకూ సమంతకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు ఆమె తల్లిదండ్రులు.

తాము అద్దె ఇంటిలో ఉంటామని, ఆమె అప్పుడప్పుడు అక్కడకు వచ్చి వెళ్తుంటుందని వారు వివరించారు. సమంత తమ దగ్గర ఎలాంటి ఆస్తులనూ దాయలేదని.. ఆమెకు సంబంధించిన పత్రాలు, నగనట్రా కూడా తమ వద్దలేవని వారు స్పష్టం చేశారు. 

మరి ఈ సంగతులన్నీ ఎలా ఉన్నా… సమంత తల్లిదండ్రులు అద్దె ప్లాట్ లో ఉండటం, వారు చాలా సామాన్యుల్లా కనిపించడమే చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. తమ కూతురు టాప్ హీరోయిన్ అయినా.. ఆమె తల్లిదండ్రులు అలాంటి లైఫ్ ను లీడ్ చేయడం విశేషమే కదా. సాధారణంగా హీరోయిన్లతో పాటు వాళ్ల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు షూటింగ్ స్పాట్ ఉండటం మామూలే. అయితే ప్రస్తుతం సమంత విదేశాల్లో షూటింగ్ ల ఉండగా.. ఆమె తల్లిదండ్రులు చెన్నైలో చాలా సాధారణఃగా కనపించారు! మరి దీంతో తల్లిదండ్రులకు, సమంతకు ఏవో తేడాలున్నాయనే అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. ఐటీ దాడులు సమంతకు ఇలాంటి ఇబ్బందిని తెచ్చిపెట్టినట్టుగా ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -