Sunday, April 28, 2024
- Advertisement -

తమిళ్ వచ్చింటే హీరో కృష్ణ ఆ పని చేసేవారట!

- Advertisement -

సీనియర్ హీరోలలో సూపర్ స్టార్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణగారు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కృష్ణ “తేనె మనసులు” చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించింది.

హీరో కృష్ణ తేనెమనసులు చిత్రం కంటే ముందుగా అతనికి ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే కృష్ణ గారికి తమిళం రాని కారణంగా ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారు. లేకపోతే తేనె మనసులు కంటే ముందుగానే తమిళంలో నటించి తమిళ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకునే వారు.తమిళ దర్శకుడు శ్రీ‌ధ‌ర్ ఓసారి చెన్నై పాండీ బజార్ లోని భారత్ కేఫ్ ముందు కృష్ణను చూసి తన సినిమాలో హీరో గా కరెక్ట్ గా సరిపోతాడని భావించి అతనిని తన సినిమాలో హీరోగా చేయడానికి తీసుకున్నారు.

Also read:రుచికరమైన చికెన్ పాప్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

శ్రీ‌ధ‌ర్ దర్శకత్వం వహించిన ‘కాద‌లిక్కనేర‌మిల్లై’ అనే చిత్రంలో హీరోగా కృష్ణని సంప్రదించారు. అయితే అతనికి తమిళం రాదని చెప్పడంతో దర్శకుడు ఒక తమిళ ట్యూటర్ ను పెట్టి వారం రోజులు కృష్ణకు ట్రైనింగ్ ఇప్పించారు.అయితే అతనికి తమిళం ఏమాత్రం వంట పట్టకపోవడంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే తెలుగులో తేనె మనసులు చిత్రం ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించి సినిమా జీవితంలో కృష్ణ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ కృష్ణ హీరోగా పరిచయం అయిన 16 సంవత్సరాల తర్వాత తిరిగి శ్రీధర్ దర్శకత్వంలో హ‌రే కృష్ణ హ‌లో రాధ (1980) నటించారు.

Also read:ఒకప్పటి ఫోటో షేర్ చేసిన వర్మ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -