Sunday, April 28, 2024
- Advertisement -

అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి గుర్తించిన పోలీసులు!

- Advertisement -

ఈమధ్య తమిళ స్టార్‌ హీరోల ఇళ్లకు బెదిరింపు కాల్స్‌ ఎక్కువైపోతున్నాయి. ఆ మధ్య ఒకసారి రజినీకాంత్‌ , హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దాంతో హుటాహుటిన పోలీసులు వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండక పోవడంతో అవి ఫేక్ కాల్స్ అని తెలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని తిరువాన్మియూరులో ఉంటున్న హీరో అజిత్‌ ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు బాంబు స్క్వాడ్‌ తో పాటు జాగిలాలను కూడా తీసుకుని అజిత్‌ ఇంటికి వెళ్లారు.  

బాంబ్ స్క్వాడ్ ఇల్లంతా అణువణువునా మెటల్ డిక్టేటర్లు, జాగిలాలతో గాలించినా ఎక్కడా లేదని తేలింది. దీంతో ఫేక్ కాల్ గా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. తాజాగా ఫోన్ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకుని, ఆ వ్యక్తిని గుర్తించారు.

చెన్నై నగరంలో మరక్కణ్ణమ్ ప్రాంతంలో ఉండే దినేశ్ అనే యువకుడు ఈ ఫోన్ కాల్ చేసినట్టు తేలింది. అతనికి మతి స్థిమితం సరిగా లేదని.. గతంలో కూడా ఇలాంటి కాల్స్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

కలుషిత నీరు తాగి నలుగురు మృతి..

ఆకాశంలో అద్భుత దృశ్యం

30 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న సీరియల్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -