Sunday, May 5, 2024
- Advertisement -

భగవంత్ కేసరి అటకెక్కింది!

- Advertisement -

రాజకీయాల పుణ్యమాని బాలయ్య సినిమాలు అటకెక్కాయి. ఇప్పటికే బాలయ్య నటిస్తున్న పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. కానీ బాబు అరెస్ట్‌ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇక బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి భగవంత్ కేసరి.

అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం పరిస్థితి చూస్తే విడుదల పోస్ట్ పోనే అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా మొత్తం సినిమా షూటింగ్ పూర్తి అయింది. మరి బాలయ్య సినిమా కోసం కాస్త టైమ్ కేటాయిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉండగా సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -