Sunday, May 19, 2024
- Advertisement -

బాలయ్య ‘రింగ్’ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా!

- Advertisement -

సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు సెంటిమెంట్ కొత్తేమీ కాదు. ఏదైనా పని ప్రారంభించాలన్న లేదా కొత్త కారు కొనాలన్న సెంటిమెంట్ ఫాలో అవ్వాల్సిందే. ఇక ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులకైతే సెంటిమెంట్ పిచ్చి అధికం. ముఖ్యంగా హీరో,నిర్మాత,దర్శకుడు ఎవరైనా ఈ సెంటిమెంట్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ముహుర్తం, శుభ గడియలు ఇలా అన్ని చూసి సినిమాను రిలీజ్ చేస్తారు. ఇక కొంతమందైతే తమకు అచ్చొచ్చిన డ్రెస్ లేదా రింగ్ లాంటివి ధరిస్తారు. ఇక నందమూరి బాలకృష్ణకు సైతం ఇదే సెంటిమెంట్ ఉంది.

ముఖ్యంగా జ్యోతిష్యం, రాళ్ల ఉంగరాలు ఇలాంటివి బాగా ఫాలో అవుతారు.ముఖ్యంగా అఖండ సినిమా చూస్తే ఇది ఖచ్చితంగా అర్ధమవుతుంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు బాలయ్య రకరకాల రింగ్స్ ధరించారు. ఇక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ చేతి ఉంగరాలను తొలగించారు. ఇక తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారు ఈ నందమూరి హీరో.

ఎందుకంటే రింగ్ ధరించకపోవడం వల్ల వీరసింహారెడ్డి అంతగా ఆడలేదని అప్పట్లోనే కొంతమందితో బాలయ్య చెప్పిన సందర్భాలున్నాయి. అందుకే ఇప్పుడు భగవంత్ కేసరితో హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బాలయ్య..మళ్లీ రింగ్ ధరించారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారగా మరి బాలయ్య రింగ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -