Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

- Advertisement -

ఇది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ సైతం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్టు ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు.

దీంతో ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు వారికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి కాకపోవడం, VFX వర్క్స్ కి కూడా టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంది.

దీనికి తోడు సైఫ్ అలీఖాన్ సర్జరీ కావడంతో అతడు షూటింగ్‌లో జాయిన్ కావడానికి టైం పట్టనుంది. ఇలా వివిధ కారణాలతో దేవర రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 5నే సూర్య ‘కంగువ’, అక్షయ్ కుమార్ ‘బడే మియాన్ చోటే మియాన్’, అజయ్ దేవగణ్ ‘మైదాన్’ ఉండటంతో దేవర వాయిదా పడటానికి ఇది కూడా ఓ కారణం అని తెలుస్తోంది. మొత్తంగా దేవర వాయిదా పడుతుందనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. మరి దీనిపై చిత్రయూనిట్ అఫిషియల్ ప్రకటన చేస్తుందా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -