Saturday, May 4, 2024
- Advertisement -

శివానీ హిట్ అందుకుంటుందా?

- Advertisement -

టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు..కానీ ఇందులో కొంతమంది హీరో, హీరోయిన్లు సక్సెస్ సాధించగా మరికొంతమంది ఇంకా సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారు. బాలీవుడ్‌లో శ్రీదేవి కూతుళ్లకు ఇంతవరకు హిట్ దక్కలేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి హీరో రాజశేఖర్‌ డాటర్స్‌కు ఉంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేసినా హిట్ సంగతి పక్కన పెడితే గుర్తింపు మాత్రం రావడం లేదు.

ప్రస్తుతం శివాని బొమ్మాళి అనే చిత్రం చేస్తుండగా ఈ సినిమాపైనే ఆమె ఆశలన్ని ఉన్నాయి. గత చిత్రాల కంటే భిన్నంగా ఇందులో కనిపించనున్నారు శివాని. అలాగే కోట బొమ్మాళి పీఎస్ సినిమాతో హిట్ కొడతామని ఖచ్చితంగా చెబుతోంది శివాని. ఈ చిత్రంలో శివాని పోలీస్‌గా నటిస్తుండగా తేజ మారిని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

స్టార్ హీరో కుమార్తె కావడం వల్ల ఒకటి లేదా రెండు ఆఫర్‌లు మాత్రమే లభిస్తాయి. అది ఇండస్ట్రీ ఎంట్రీకి ప్లస్‌గా మారుతుంది. కానీ తర్వాత వారు తమ ప్రతిభను చాటుకోకపోతే ఇండస్ట్రీలో రాణించడం కష్టం. మరి ఈ రెండు సినిమాలు శివానిని నిలబెడతాయో లేది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -