Saturday, April 27, 2024
- Advertisement -

బాబు బెయిల్‌పై సుప్రీంకు ఏపీ సర్కార్!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ పై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. ఇక మధ్యంతర బెయిల్ సందర్భంగా ఇచ్చిన కండీషన్స్‌ని సడలించింది న్యాయస్థానం. ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించింది.

ఇక చంద్రబాబుకు బెయిల్ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాలను ధాటి హైకోర్టు వ్యవహరించిందని ఏపీ సర్కార్ భావిస్తోంది. చంద్రబాబు లేవనెత్తని అంశాల జోలికి హైకోర్టు వెళ్లిందని..వాటిని న్యాస్థానం పరిగణలోకి తీసుకుని ఉండకూదని వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే దర్యాప్తులో లోపాలను ప్రస్తావించింది.

ఇక సీఐడీ కోరి వివరాలను ఏ మాత్రం అందజేయలేదని…. వాస్తవానికి బెయిల్ కేసుల్లో కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లకూడదు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగే సమయంలో చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలను వినిపించలేదు. దీనిపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ అభ్యంతరాన్ని హైకోర్టు కూడా రికార్డు చేసింది. ఈ అంశాలన్నింటిని సుప్రీంలో ప్రాస్తవించనుంది ఏపీ సర్కార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -