Thursday, May 2, 2024
- Advertisement -

సీక్రెట్ గా నిత్యా పెళ్లి చేసుకుందా ?

- Advertisement -

నటనలో మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకరు. అయితే ఎత్తు తక్కువ కాబట్టి అవకాశాలు తగ్గాయి కానీ.. లేకుంటే అందరి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది. ఇప్పటికి ఆమెకి ఉన్న ఫాలోయింగ్ తక్కువేమి కాదు. తెలుగులో కూడా ఈమెకు విపరితమైన క్రేజ్ ఉంది. ’అలా మొదలైంది’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ నటనకు అవకాశం ఉన్న పాత్రలే చేసింది. గ్లామర్ రోల్స్ కి చాలా తక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఈ మధ్య గీత గోవిందం, ఎన్టీఆర్ కథానాయుకుడు సినిమాల్లో నటించింది.

ఇక ప్రస్తుతం మాజీ సీఎం జయలలిత బయోపిక్ లో నిత్యా నటిస్తోంది. ’ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రను నిత్యమీనన్ పోషిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రముఖ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ’శ్రీమతి నిత్యా మీనన్’ అని పేర్కొంది. దాంతో చర్చ మొదలైంది. మాములుగా అయితే పెళ్లైన వారినే శ్రీమతి అంటారు.

కానీవారిని కుమారి అంటారు. అయితే ఆ పత్రిక శ్రీమతి అని పేర్కొంది. దాంతో నిత్యాకు పెళ్లైందని ప్రచారం జరుగుతోంది. నిజానికి స్టార్ హీరోయిన్స్ అయిన రాధికా ఆఫ్టే, శ్రియ, ఇలియానా రహస్య పెళ్లిలు చేసుకున్నారు. తమ బాయ్ ప్రెండ్స్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు ప్రకటించారు. ఇక ఇలియానా అతని బ్యాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ కూడా చెప్పింది. కాబట్టి నిత్యా కూడా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మరి పెళ్లి కాకుంటే శ్రీమతి అని ఎందుకు రాస్తారు అని వైరల్ చేస్తున్నారు. టెలివిజన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన ఆలివర్ మాక్ కల్హౌన్‌తో దిగిన ఫొటోలను ఇప్పటికే నిత్యా మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆనెనెస్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆలివర్ తనకు మంచి మిత్రుడని చెప్పకనే చెప్పారు. దీంతో నిత్య పెళ్లిపై ఇప్పుడు అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. మరి ఈ పెళ్లి రూమర్ నిజమా కాదా తెలియాలంటే నిత్యా స్పందించాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -