Saturday, May 18, 2024
- Advertisement -

పవన్ సినిమా స్టోరీ లీక్!

- Advertisement -

పబ్లిసిటీ కోసం కావాలనే సినిమా స్టోరిలు లీక్ అయ్యాయి అనే వార్తలు వస్తుంటాయి. మరి నిజంగానే లీజ్ ఔతున్నాయో లేక కావాలనే చేస్తున్నారో గాని ప్రతి పెద్ద హీరోకి సంబంధించి స్టోరీ లీక్ అయింది అని సోషల్ మీడియాలో కథలు కనిపిస్తున్నాయి.  లేటేస్ట్ న్యూస్ ఏమిటంటే. నిన్న ప్రారంభమైన పవన్ ఎస్.జె. సూర్యల కొత్త మూవీ మూల కథ లైన్ ఇదేనంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. ఈసినిమా పూజా కార్యక్రమం జరిగి ఒకరోజు గడవకుండానే ఈసినిమా కథ గురించి లీకులు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

వచ్చే వార్తల ప్రకారం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ లేటెస్ట్ మూవీ ఒక ఫ్యాక్షన్ లీడర్ ప్రేమ కథ అని వార్తలు వస్తున్నాయి. పవన్ ఈసినిమాలో ఫ్యాక్షన్ లీడర్ గా ప్రేమికుడుగా రెండు షేడ్స్ లో కనపడతాడట. కథ పూర్తి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటూ బ్యాక్ డ్రాప్ లో మాఫియా స్టోరీ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. యూత్ ను టార్గెట్ చేసే విధంగా ఈసినిమాకు ‘హుషారు’ అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉందికానీ ఇది ఇంకా ఖరారు కాలేదు.ఇక పవన్ ఫ్లాష్ బ్యాక్ లో పూర్తి స్థాయి లవర్ బాయ్ గా కనిపించనున్నడట. మాఫియా,ఫ్యాక్షన్ రెండిటినీ సమానంగా రంగరించి ఫైట్ల విశయం లో మరీ ఎక్కువ వయోలెన్స్ లేకుండా స్టోరీ రాసుకున్నారట.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన రెండు పాటలను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాటల రికార్డింగ్ ని కూడా పూర్తి చేసాడు. అయితే పవన్ లేటెస్ట్ సినిమా కథ గురించి బయటకు వస్తున్న లీకులు వింటూ ఉంటే 2011 లో విడుదలైన పవన్ ‘పంజా’ సినిమా కథ గుర్తుకు వస్తోంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. పంజా కథ వింటేనే పవన్ మరో సినిమా “బాలు” గుర్తుకు వస్తుంది. ఇక ఈ కొత్త కథ కూడా అదే పంథాలో సాగితే సినిమా ఫలితం ఎలాఉంటుందో మరి. ఈ విశయం లో ఎస్జే సూర్య ఏ జాగ్రత్తలు తీసుకుంటాడో చూదాలి. ఏదేమైనా ఇప్పటికిప్పుడు పవన్ కి ఒక మంచి హిట్ అవసరం ఉంది. మరి ఈ కొత్త సినిమా పవన్ కి ఎలాంటి అనుభవాన్నిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -