Sunday, May 19, 2024
- Advertisement -

భారత దేశం నుంచి మరొక గర్వపడే మిషన్

- Advertisement -

సొంత నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ ఉన్న దేశాల స‌ర‌స‌న భార‌త్ చేరింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-33 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం విజ‌య‌వంత‌మైంది.

దీంతో సొంత నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ ఉన్న ఆరో దేశంగా భార‌త్ నిలిచింది. ఆరు ఉపగ్రహాలతో 12 ఏళ్ల పాటు పని చేస్తూ ఎప్పటికప్పుడు కీలక సమాచారాన్ని మ‌న‌కు అందించ‌నుంది. నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించి దిక్సూచి వ్యవస్థను మరింత మెరుగు పర్చనుంది. ప్ర‌యోగం విజ‌యం కావ‌డం ప‌ట్ల‌, షార్ శాస్త్రవేత్తలు, ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

సినిమా వారో, రాజకీయ నాయకులో, క్రికెట్ ప్లేయర్ లో కాదు ఈ దేశాన్నీ దేశ జనాభా నీ ప్రతి రోజూ గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తున్న ఇస్రో శాస్త్ర వేత్తలకి జే జే లు చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -