Sunday, May 19, 2024
- Advertisement -

శ్రీనువైట్ల ఇల్లు మారాల్సిందేనా..?

- Advertisement -

శ్రీనువైట్లకు వరుస పెట్టి వస్తోన్న కష్టాలకు అతని ఇంటి వాస్తే కారణమని చెప్పడం ఎంత వరకు కరెక్ట్.శ్రీను చేసిన సినిమాలు ఫెయిల్యూర్ కావడం వెనుక ఉన్న సమస్య కేవలం ఇంటి దోషమే అని చెప్పి అతని చేత కొందరు ఇల్లు అమ్మించే ప్రయత్నం చేయడం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆగడు,బ్రూస్ లీ సినిమాలు ఆ ఇంటిలోకి వెళ్లాకనే వచ్చాయని అందుకే అవి ఫ్లాప్స్ గా మారాయని,అలాగే అతని వైఫ్ రూప కూడా అతనిపై కేసు పెట్టి వాపసు తీసుకోవడం కూడా ఇలా ఇంటి దోషం మీద పడటం వలనే జరిగిందని … కొందరు శ్రీను చెవిలో ఒకటే ఊదేస్తున్నారు.

దీంతో శ్రీనువైట్ల తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే అతని ఇంటిపక్కనే ఉన్న మరో ఇద్దరు 

కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటూ ఉండడంతో వీరి ఉన్న స్థలానికి ఏదో దోషం పట్టిందని కొందరు అదే పనిగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇపుడున్న టైమ్లో శ్రీను కూడా ఇలాంటి సెంటిమెంట్ కే ఊతిమిచ్చి ఇల్లు మారితే అది ఇన్ డైరెక్ట్ గా తన స్టార్ డమ్ ను కాపాడుకున్నట్లు అవుతుంది కాబట్టి ఇంటి విషయంలో ఈ వారం పదిరోజుల్లో ఓ డెసిషన్ తీసుకోబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -