Friday, April 19, 2024
- Advertisement -

వ్యభిచారంలో దొరికిన దొరబాబు గురించి అతని భార్య ఏమన్నాదంటే ?

- Advertisement -

దొరబాబు బిల్లితెరపైకి రాకముందు ఎక్కువగా అడల్ట్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించేవాడు. జబర్దస్త్ లో అవకాశం రావడంతో దొరబాబుపై పంచులు వేసి హైపర్ ఆది అతని బాగా లేపాడు. దాంతో మనోడికి బానే క్రేజ్ వచ్చింది. సినిమాల్లోకూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. అయితే ఇటీవలే దొరబాబు, ఆది టీంలో ఉండే మరో కమెడియన్ పరదేశి ఇద్దరు వ్యభిచారం చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు.

మరి ఇంత జరిగాక వీరిద్దరు జబర్దస్త్ లో ఉంటారో లేదో చూడాలి. అయితే దొరబాబు భార్య అమూల్య రెడ్డికి టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన భర్త వ్యభిచార గృహంలో దొరికిన రోజునే ఆమె టిక్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. డి ఫర్ దొరబాబు, మై లైఫ్ లవ్ యు సోమచ్ బుజ్జీ అంటూ దొరబాబు పేరును చేతిపై టాటూ వేయించుకుని భర్తపై ఉన్న ప్రేమను ఈ సందర్భంగా వ్యక్తపరిచింది. అయితే దొరబాబు విషయంలో ఆమెను చాలా మంది ప్రశ్నలు సంధిస్తుండతో మరోసారి తన అభిప్రాయాన్ని ఓ పోస్ట్ ద్వారా క్లియర్ చేసింది.

ఒక వ్యక్తిని అపార్ధం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజా నిజాలు అర్థం అవుతాయి. ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోకూడదు’ అనే కొటేషన్‌ను తన టిక్ టాక్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టింది. దీంతో ఒక్కసారికి ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. భర్త రెడ్ హ్యాండెడ్‌గా వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోతే.. ఇంతిలా సపోర్ట్ చేసే భార్య ఎక్కడైనా దొరకుతుందా?.. భర్త ఎంత తప్పు చేసినా క్షమించే మీ గుణం లక్షల్లో ఒక్కరికే ఉంటుంది అంటూ దొరబాబు భార్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొంతమంది అయితే.. కళ్లు మోసం చేయడం ఏంటి మేడమ్.. కళ్ల ముందే మీ ఆయన ఇంకో మహిళతో వ్యభిచారం చేస్తూ దొంగలా దొరికిపోతే.. ఇంకా ఆయన్నే నమ్ముతున్నారా అని అంటున్నారు. ఏది ఏమైన జరిగిందేదో జరిగిపోయింది అన్నట్లు దొరబాబు భార్య తన కాపురాన్ని చక్కదిద్దుకోవడంలో మాత్రం చాలా మెచ్యూర్డ్‌గానే ఆలోచిస్తున్నట్లు అర్దం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -