Thursday, March 28, 2024
- Advertisement -

రాజమౌళి సినిమా ను తిరస్కరించిన తల్లి కూతుళ్లు

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఎన్టీఆర్ పక్కన నటించాల్సిన హాలీవుడ్ బ్యూటీ డైజీ ఎడ్గార్ జోన్స్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం దర్శకనిర్మాతలు బోలెడు హీరోయిన్లను పరిగణలోకి తీసుకున్నారు.

తాజాగా ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు జాన్వి కపూర్ ని సంప్రదించినట్లు సమాచారం. కానీ ప్రస్తుతం బోలెడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వి రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందట. తన పాత్ర కంటే ఆలియాభట్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వల్లనే ఆమె ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది అని కొందరి వాదన. గతంలో ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ కంటే ముందు రాజమౌళి శ్రీదేవి ని సంప్రదించారు. కానీ ఆమె తిరస్కరించింది. ఇప్పుడు తల్లి బాటలోనే కూతురు కూడా రాజమౌళి సినిమాకు నో చెప్పింది అన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -