Monday, April 29, 2024
- Advertisement -

వివాదాల్లో మళ్ళీ ఇరుక్కున్న బిగ్ బాస్

- Advertisement -

తమిళనాడు లో ఒక సినిమా ని కానీ ఏదైనా టీవీ షో ని ఆపాలి అంటే అక్కడ కొంత మంది జనాలు సిద్ధం గా ఉంటారు. వివాదం అంటే చాలు చాల మంది తమ పనులన్నీ పక్కన పెట్టేసి బయటకు వచ్చి మీడియా ముందు పోరాడుతూ ఉంటారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు, ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువు అయింది. అలాగే కమల్ హాసన్ పేరు ఒక ప్రాజెక్ట్ లో ఉంది అంటే, ఎప్పుడెప్పుడు దానిని వివాదాల్లోకి లాగుదామా, లేకుంటే ఏదైనా తప్పు జరిగితే దానిని పెద్దది చేద్దామా అని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా ఎక్కువే ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా వివాదాల్లో ఇరుక్కున్న కమల్ హాసన్ ప్రాజెక్ట్ బిగ్ బాస్ 3.

కమల్ హాసన్ ఈ షో కి కేవలం వ్యాఖ్యాత మాత్రమే. అందుకే అది చిన్న సమస్య అయినా కచ్చితం గా దానిని పెద్ద వివాదం లా మార్చే వరకు కొంత మంది నిద్ర పోరు. ఇది నిజం. అయితే ప్రస్తుతం కమల్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ షో మీద తమిళనాడు హై కోర్టు లో ఒక పిటీషన్ దాఖలయింది. అయితే షో టెలికాస్ట్ కూడా ఇంకా మొదలు కాకా ముందే ఇలా వివాదం జరగడం చర్చనీయాంశమయింది.

బిగ్ బాస్ కార్యక్రమం తీరు సరిగాలేదని, అందులో పాల్గొనేవారు పొట్టి దుస్తుల్లో ఉంటారని, ఇది సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుంది అని కొంతమంది షో ని ఆపేయాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విచారణ ఇంకా మొదలు కాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -