Saturday, April 27, 2024
- Advertisement -

ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ దేవర లుక్!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం తొలి పార్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుండగా ఎన్టీఆర్ – జాన్వీకపూర్ మధ్య డ్యూయెట్‌ని చిత్రీకరిస్తున్నారు.ఇక గోవాలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేశారు.

ఈ ఫొటోలో న‌డుముపై చేతులో వేసుకొని మెడ‌లో రుద్రాక్షతో ఎన్టీఆర్ ఉండగా పక్కన దర్శకుడు కొరటాల శివతో పాటు కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఉన్నారు. గోవాలో చిత్రీక‌రించ‌నున్న పాట‌కు రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

వాస్తవానికి సినిమా ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని భావించినా కొన్ని అనివార్యకారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ అయింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో దేవర తెరకెక్కుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -