యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత జనతా గ్యారేజ్ లో బిజీ అయిపోయాడు. ఇదివరకు లాగా ఒక దాని తరవాత ఒకటి నెమ్మది నెమ్మదిగా చూసుకుని స్టార్ట్ చెయ్యడం కాకుండా చాలా ఫాస్ట్ గా పనులు లాగించేస్తున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ సినిమా విషయం లో అతని ఫాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
శ్రీమంతుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ కి ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వడం అంటే మరొక బ్లాక్ బస్టర్ తమకి ఒచ్చేసినట్టే అని వారు ఫిక్స్ అవుతున్నారు . జనత గ్యారేజ్ టీజర్ విషయం లో ఒక కొత్త వార్త హల్చల్ చేస్తోంది.
ఇంకా మొన్ననే షూటింగ్ విడుదల అయిన ఈ సినిమా కి సంబంధించిన ఆసక్తికర టీజర్ ని మే 28 న నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని ఎన్టీఆర్ ఆలోచనతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే నిజం అయితే నందమూరి ఫాన్స్ కి పండగే.
