- Advertisement -
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన తమిళ పీరియడ్ డ్రామా కాంతా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. 1950లో మద్రాస్ నేపథ్యంగా, సినీ పరిశ్రమ వాతావరణం, వ్యక్తిగత సంఘర్షణలు, భావోద్వేగ పార్శ్వాలతో సాగిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దుల్కర్ నటన మరియు కాలానికి తగ్గ విధంగా రూపుదిద్దిన సెట్టింగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు పొందింది.
కాంతా నవంబర్ 14, 2025న థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. దీంతో థియేటర్లలో చూడలేని ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఈ సినిమాను ఆస్వాదించే అవకాశముంది.
డిసెంబర్ 12 నుంచి Netflixలో స్ట్రీమింగ్‌కు రానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
