- Advertisement -

అక్షయ్‌ ప్రాజెక్టుకు దిల్ రాజు ఓకే!

- Advertisement -

నిర్మాత దిల్ రాజు & శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. నిర్మాత దిల్ రాజు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థకు సంబంధించిన రానున్న ప్రాజెక్టులపై విస్తరిస్తున్న రూమర్లు మరియు ఊహాగానాల నేపథ్యంలో స్వయంగా ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. ఊహాగానాలను ప్రస్తుత పరిణామాలకు అన్వయించడం సరైన సమాచారంకాదు అని వెల్లడించింది ఎస్వీసీ.

ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ తో ఒక ప్రాజెక్ట్‌ రూపొందిస్తున్నాము. ఈ చిత్రానికి అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో అధికారిక వివరాలను వెల్లడిస్తాము.

మీడియా ప్రతినిధులు మా తరఫు నుంచి ధృవీకరణ లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఊహాగానాలను ప్రచారం చేయడం నివారించాలని మనవి అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -