Tuesday, May 7, 2024
- Advertisement -

‘అరవింద సమేత’లో కాజ‌ల్‌ ఐటెం సాంగ్‌?

- Advertisement -

ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ.ఈ సినిమా షూటింగ్ న‌గ‌ర శివార్ల‌లో జ‌రుపుకుంటుంది.ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌,టైటిల్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది.త్రివిక్రమ్ స్టైల్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు మాస్ ఫాన్స్ కు కావలసిన యాక్షన్ మసాలాకు ఇందులో లోటేమి లేదని క్లారిటీ రావడంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజ హెగ్డె న‌టిస్తుంది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త విన‌బ‌డుతుంది.సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంటుంద‌ని,ఆ సాంగ్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అల‌రిస్తుంద‌ని స‌మాచారం.ఎన్టీఆర్ సినిమాల‌లో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు.గ‌తంలో ఆయ‌న న‌టించిన జనతా గ్యారేజ్ సినిమాలో కాజ‌ల్ ఐటెం సాంగ్ చేసింది. జై లవకుశలో తమన్నా స్వింగ్ జరా అంటూ ఎన్టీఆర్ అభిమానుల‌కు మంచి కిక్కు ఇచ్చింది.

ఇప్పుడు మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ -ఎన్టీఆర్ సినిమాలో కాజ‌ల్ ఐటెం సాంగ్ చేస్తుంద‌నే వార్త బ‌య‌టికి రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఎన్టీఆర్ సినిమాల‌లో హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేస్తే ఆ సినిమా హిట్టే అని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -