Tuesday, May 14, 2024
- Advertisement -

కాజల్ వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పరిస్థితి ఇప్పుడు మరీ తీసికట్టుగా ఉంది. కెరీర్ ఏమవుతుందో అనుకునే టైంలో సర్దార్ బ్రహ్మోత్సవం ఆఫర్స్ రావడంతో.. కాజల్ మళ్లీ టాప్ రేంజ్ కి వెళ్తుందని అందరూ అనుకుంటే..

ఆ రెండు డిజాస్టర్లుగా మిగలడంతో ఐరన్ లెగ్ అనిపించుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోలింగ్ స్టార్ట్ చేసేసింది చందమామ. తన స్టైల్ లో ఆ రెండు సినిమాల ఫ్లాప్ భారం నుంచి తప్పించుకుంటోంది. ఇండస్ట్రీ రికార్డులు సృష్టిస్తాయని అనకున్న రెండు సినిమాలు ఫెయిల్ కావడం రెండింటిలోనూ హీరోయిన్ గా నటించడంపై అమ్మడి అభిప్రాయం అడిగితే.. ఏమని సెలవిచ్చిందో తెలుసా? ‘అవి రెండు చాలా పెద్ద సినిమాలు.

వాటికి నో చెప్పడానికి ఏ అవకాశం లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించాల్సి ఉండడంతో.. ఆల్రెడీ ఓ హిట్ సినిమా చేతిలో ఉందనుకున్నా. ఇక బ్రహ్మోత్సవంలో అయితే నేను ఫస్టాఫ్ లో మాత్రమే కనిపిస్తా. నా పాత్ర నాకు బాగా నచ్చింది. గ్లామర్ ఒలకబోసే రోల్ కాదు. తన ఆలోచనలతో హీరోకి నో చెప్పే స్ట్రాంగ్ కేరక్టర్ అది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్.

ఇదంతా చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఆడుతుంది అనుకున్నానని.. ఇక బ్రహ్మోత్సవంలో అయితే.. ఫస్టాఫ్ లోనే ఉన్నా నా కేరక్టర్ బాగుందిగా.. మిగతాదంతా నాకేం సంబంధం అంటూ ఇన్ డైరెక్టుగా సెటైర్లు వేస్తున్నట్లు లేదూ? బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయడమేమో కానీ.. కాజల్ ఇలాంటి కబుర్లు బాగా నేర్చిందబ్బా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -