Thursday, May 16, 2024
- Advertisement -

మీడియాపై చిందులేసిన సుడిగాలి సుధీర్!

- Advertisement -

జబర్దస్త్ అనే షో తో మంచి కమిడయన్ గా పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ సంబంధించి కమిడయన్స్ ఏదో విదంగా తమదైన శైలిలో నోరు జారి వివాదంలో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడిప్పుడే సినిమాల్లో చిన్న చిన్న కామెడి వేషాలు వేస్తున్న సుడిగాలి సుధీర్ నిన్న రాత్రి మీడియాపై ఓ రెంజ్ లో రెచ్చిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్నరాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డుపై సుధీర్ హల్ చల్ చేశాడు.

తన కారుని ఢీ కొట్టారంటూ హాస్పటిల్ కు వెళ్తున్నవారిపై దాడి చేసారు. ప్లీజ్ వదిలేయండి అని వారు అడిగిన సుధీర్ మాత్రం వదలలేదు. దాంతో నడిరోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిపోయింది. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ విరుచుకుపడ్డాడు. ఈలోగా ఇదంతా అటుగా వెళ్తున్న ఓ మీడియా ఛానెల్ వాళ్లు రికార్డ్ చేస్తూండటంతో కోపం వచ్చి బూతులు మొదలెట్టాడు.

మీరు మీడియా అయితే ఏంటి.. నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ ఆ మీడియా వారి పై  కూడా బూతులు తిట్టాడు. దాంతో చుట్టూ వెళ్తున్న వారంతా సుధీర్ ని చూసి షాక్ అయ్యారు. జబర్దస్త్ లో నవ్వించే సుధీర్ ఇలా నడిరోడ్డుపై ఇలా హంగామా చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. హాస్పటిల్ కు వెళ్తున్నా, క్షమింపమని అడిగినా వదలక పోవటం స్థానికులను షాక్ చేసింది.

{youtube}f2y6xbXtx1c{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -