Sunday, May 19, 2024
- Advertisement -

కాజల్, నిషాలు కొత్త బిజినెస్ చేస్తున్నారు!

- Advertisement -

కాజల్ హీరోయిన్ గా కాస్త నిలదొక్కుకోగానే నిషా అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసింది.

టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో అక్కకు ధీటుగా వ్యవహరించినా.. నిషాకు అంతగా అవకాశాలు కలిసి రాలేదు. దీంతోనేనేమో నిషా పెళ్లి చేసుకొని సెటిలయ్యింది. ముంబాయికి చెందిన ఒక వ్యాపారవత్తేను నిషా వివాహం చేసుకొంది.

అక్కకు పెళ్లి కాకుండానే పెళ్లి చేసేసుకొన్న ఈ చెల్లెలు ఇప్పుడు వ్యాపార రంగంపై దృష్టి సారించినట్టుగా ఉంది. స్వయంగా వ్యాపారవేత్తగా మారి..  సెటిలయ్యే ప్రయత్నంలో ఉంది. ఇంతకీ నిషా చేయబోతున్న వ్యాపారం ఏమిటంటే.. నగల బిజినెస్. ముంబైలో భారీ బంగారు షాపును ఒకదాన్ని నిషా ఓపెన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యాపారం వెనుక నిషా భర్త ప్రోద్భలంగా ఉందట.
ఇక అక్కా చెల్లెల్లిద్దరూ గ్లామర్ విషయంలో ఒక రేంజ్ లోఉన్నారు. దీంతో వీరే ఈ బంగారు దుఖాణానికి ప్రమోటర్లుగా వ్యవహరించనున్నారట! దీంతో.. ఈ వ్యాపారం పుంజుకొంటుందనే ఆశాభావం వారిలోకూడా కనిపిస్తోంది. పెళ్లితో సినిమాల పరంగా కెరీర్ ఆగిపోయినా.. ఇలా వ్యాపార రంగంలో రాణించడానికి నిషా అగర్వాల్ ప్రయత్నిస్తోంది. మరి ఈ రంగంలో ఆమె ఏ మేరకు రాణిస్తుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -