Thursday, May 16, 2024
- Advertisement -

తెలుగుదేశాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న బీజేపీ..!

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలతో భారతీయ జనతా పార్టీ.. తెలుగుదేశం పార్టీల మధ్య దోస్తీ కుదిరింది.

అంతకు ముందు చాలా సంవత్సరాలుగా.. దూరదూరంగా ఉండిన ఈ రెండు పార్టీలు మొన్న మాత్రం దగ్గరయ్యాయి. అదృష్టం కలిసి వచ్చింది.. కేంద్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది.. ఏపీలో తెలుగుదేశం సోలోగా అధికారంలోకి వచ్చింది. అయినా ఈ రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది.

అయితే ఇప్పడు వీరి బంధంలో కొన్ని పదనిసలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య తరచూ భారతీయ జనతా పార్టీ నేతలు గొంతు సవరిస్తున్నారు. తెలుగుదేశం వారు తమకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని.. తమకు నామినేటెడ్ పోస్టుల్లో వాటా కావాలని.. అంటున్నారు. ఈ కోపం పెరిగినప్పుడు..తెలుగుదేశం పై పెరుగుతున్న వ్యతిరేకత తమకూ ప్రమాదంగా మారుతోందని అంటున్నారు.

అందుకే ప్రభుత్వంపై పోరాట పంథాను అనుసరిద్ధామని కూడా బీజేపీ నేతలు తమలో తాము మాట్లాడుతున్నప్పుడు వ్యాఖ్యానించుకొంటున్నరు. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో కూడా భారతీయజనతా పార్టీ వారు తెలుగుదేశం నేతల తీరును వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమతో ప్రయోజనం లేదని వారు తేల్చేశారు.

మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. పట్టిసీమపై తెలుగుదేశం తో కాంప్రమైజ్ కావడానికి బీజేపీ రెడీ అని తెలుస్తోంది. అయితే ఇలా కాంప్రమైజ్ కావడానికి బీజేపీ  ఎమ్మెల్సీ పదవులను డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. త్వరలో గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే పదవుల్లో తమకు కొన్నింటిని కేటాయించాలని.. లేకపోతే పట్టిసీమపై పోరాట పంథాను అనుసరిస్తామని కమలనాథులు హెచ్చరిస్తున్నారట. ఈ విధంగా తెలుగుదేశాన్ని భారతీయ జనతా పార్టీ బ్లాక్ మెయిల్ చేస్తోంది. దీనికి సైకిల్ పార్టీ ఏ మేరకు తలొగ్గుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -