Friday, May 17, 2024
- Advertisement -

అఖిల్‍ను సోగ్గాడే దారిలోకి తెవాలి!

- Advertisement -

ఈ సంక్రాంతికి వచ్చిన  ‘సోగ్గాడే చిన్ని నాయనా‘ మంచి హిట్ అయ్యి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత నాగార్జునకు మంచి హిట్ వచ్చింది. దీని ముఖ్య కారణం ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నాగార్జునకు తగ్గట్టుగా ఈ సినిమాని తీర్చీదిద్దాడు దర్శకుడు.

ఈ సినిమాతో దర్శకుడికి మంచి క్రేజ్ వచ్చింది. కళ్యాణ్ కృష్ణని నమ్మి ఈ సినిమా చేసినందుకు నాగార్జున ఇప్పుడు ఫుల్ హ్యాపిగా ఉన్నాడు. కళ్యాణ్ కృష్ణ సెకండ్ ఫిల్మ్ కూడా తన బ్యానర్ లోనే చేయాలని అడిగాడట నాగార్జున. కళ్యాణ్ కృష్ణ కూడా తన తదుపరి చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో చేయాలి అని ఫిక్స్ అయ్యాడట.

అఖిల్ సెకండ్ మూవీని కళ్యాణ్ కృష్ణ డైరేక్ట్ చేయబోతున్నాడట. అందుకోసం కథను రెడి చేయమని నాగ్ చేప్పాడట. అఖిల్ సరిపోయేలాగా ఓ మంచి కథ తయారు చేయమన్నాడట. కథ నాగ్‍కి నచ్చితే అఖిల్ సెకండ్ మూవీ తొందరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -