Monday, May 20, 2024
- Advertisement -

సందీప్ కిషన్ హీరోయిన్ అంటే సూపర్ లక్కీ మరి

- Advertisement -

కుర్ర హీరోల్లో మంచి జోష్ తో పాటు నటన ఉన్న హీరో సందీప్ కిషన్. ప్రస్తానం, స్నేహ గీతం లాంటి సినిమాలతో కనిపించిన సందీప్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే సందీప్ కంటే సందీప్ తో నటించిన హీరోయిన్ లు చాలా పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతూ ఉండడం గమనార్హం.

రొటీన్ లవ్ స్టోరీ అనేది ఇతని తొలి చిత్రం అందులో అతనితో రోమాన్స్ చేసిన హీరోయిన్ ‘రేజీనా కసాండ్రా’ ఇప్పుడు మంచి రేంజ్ లో ఉంది, సందీప్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించిన రకుల్ అయితే ఏకంగా టాలీవుడ్ ట్రెండింగ్ హీరోస్ తో జతకట్టే రేంజ్ కు వెళ్లింది.

 ఇక 2014లో వచ్చిన బీరువా సినిమాలో తనతో నటించిన సురభి ఇప్పుడు స్టార్స్ తో నటించేందుకు రెడీ అవుతుంది. ఈ మధ్యనే ఎక్స్ ప్రెస్ రాజా అంటూ హిట్ కొట్టిన సురభి తర్వాత సినిమా పూరి దర్శకత్వంలో కళ్యాణ్ రాం సరసన నటించబోతుందని టాక్.

తన పక్కన హీరోయిన్ లుగా చేసినవాళ్ళు అంతా సూపర్ పొజిషన్ కి వెళుతూ ఉంటె సందీప్ ఇంకా ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఒక బ్రేక్ ఇచ్చే సినిమా త్వరలో రావాలి అని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -