Monday, May 20, 2024
- Advertisement -

బ్రేక్ అప్ అయిన జంట మధ్యలో దూరిన టాప్ హీరో

- Advertisement -

ఒక జంట దెబ్బలాడుకుంటూ ఉంటే మధ్యలో దూరకూడదు అని చెబుతూ ఉంటారు మన పెద్ద వాళ్ళు. అప్పుడెప్పుడో లవర్స్ గా ఉండి బ్రేకప్ చెప్పేసుకున్న హ్రితిక్ రోషన్ కంగనా రనౌట్ లో ఇప్పుడు లీగల్ గొడవల ముసుగులో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

వారి గొడవ రోజు రోజుకూ ముడురుతూ ఉండగా సర్దు మణిగే లా కనపడ్డం లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు వీరి విషయంలో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. హ్రితిక్ – కంగనా ఇద్దరూ మొదటి నుంచీ ఆమిర్ ఖాన్ కి క్లోజ్ మనుషులు. ఇద్దరి ఇళ్ళలో ఏ ఆపార్టీ జరిగినా ఆమిర్ ఖాన్ వెళ్ళడం అలాగే ఆమిర్ ఖాన్ ఇంట్లో ఎలాంటి పార్టీ అయినా కంగనా రావడం లాంటివి మామూలేనట.

దీంతో ఆమెను చల్లబరిచేందుకు ప్రయత్నిస్తున్నాడట అమీర్. మరోవైపు హృతిక్ రోషన్ కి కూడా పబ్లిక్ గా గొడవలు వద్దని వారిస్తున్నాడట అమీర్. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో.. అమీర్ ఖాన్ రెండు వెర్షన్లు తెలుసని అందుకే శాంతిదూతగా మారేందుకు ట్రై చేస్తున్నాడని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -