Monday, May 6, 2024
- Advertisement -

కోర్టుకెక్కిన ఉద్ధవ్ థాకరే

- Advertisement -

శివసేన అధ్యక్షుడు, దివంతగ బాల్ థాకరే కుమారులు ఆస్తుల కోసం కోర్టుకెక్కారు.  బాల్ థాకరేకు ఇద్దరు కుమారులు. వీరిలో ఉద్ధవ్ థాకరే శివసేన అధ్యక్షుడిగా ఉన్నారు. తన తండ్ర బాల్ థాకరే రాసిన వీలునామాను అధికారికంగా గుర్తించాలంటూ ఉద్దవ్ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిపై ఉద్ధవ్ సోదరుడు కెవియట్ పిటీషన్ దాఖలు చేశారు.

దీంతో ఉద్ధవ్ వేసిన పిటీషన్ ను ముంబాయి హైకోర్టు తిరస్కరించింది. తన తమ్ముడు కెవియట్ లో వేసిన కుటుంబ చరిత్రను తొలగించాలంటూ ఉద్ధవ్ కోర్టును కోరారు. అయితే ఆ అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించింది. బాల్ థాకరే 2012 నవంబర్ 17న మరణించారు. ఆ తర్వాత సంవత్సరం వీలునామాను అధికారికంగా దృవీకరించాలంటూ ప్రొబేట్ పిటీషన్ ను ఉద్ధవ్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్ ను వీలునామా దావాగా మార్చారు. తండ్రి ఆస్తిలో వాటా దక్కకపోవడంతో జైదేవ్ కోర్టులో కెవియట్ దాఖలు చేశారు. తన వాదన వినాలని కోర్టును అభ్యర్ధించారు. తాను కుటుంబంలో అంతర్భాగమని చెప్పేందుకు కొన్ని డాక్యుమెంట్లు సమర్పించారు. మొత్తానికి ఆస్తి కోసం థాకరే కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -