Monday, April 29, 2024
- Advertisement -

కంగనా…పెళ్లికి ఓకే కానీ కండీషన్స్ అప్లై!

- Advertisement -

కాంట్రవర్సీ అనే పదానికి కేరాఫ్ కంగనా రనౌత్. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ కాంట్రవర్సీ వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే పెళ్లిపై ఆమెకు ఎప్పుడు ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా కంగనా ప్రధాన పాత్రలో నటించిన తేజస్ ప్రమోషన్‌ సందర్భంగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి అమ్మాయి తన పెళ్లి గురించి కలలు కంటుంది…తాను కూడా పెళ్లిచేసుకొని ఒక కుటుంబం ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. అయితే ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను కానీ అది పెద్దలు కుదిర్చిన పెళ్లేనని తెలిపింది.

ఇక రిలేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయని అనుకోవద్దని..అంతా సక్సెస్ కాలేరన్నారు. ఇది తెలిసి కూడా తాను ప్రేమలో ఫెయిల్ అయ్యానని.. దానివల్ల తనకు మంచే జరిగిందన్నారు. ఒకవేళ ప్రేమలో ఉండి ఉన్నట్లయితే సమయం అంతా దానికే కేటాయించాల్సి వచ్చేదని…అందుకే ప్రేమ అనే బంధం నుండి తనని దేవుడు రక్షించాడని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -