Friday, April 26, 2024
- Advertisement -

డ్రగ్స్ కేసులో మరో సంచలన పేరు.. హతవిధీ.. ?

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఇప్పుడు డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల చుట్టు ఈ కేసులు నడుస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తి మెడ చుట్టు డ్రగ్స్ కేసులు చుట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వైపు బాలీవుడ్ లో మరోవైపు కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ బాగోతాలు బయట పడ్డాయి. ఈ నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమ శాండిల్‌వుడ్ డ్రగ్స్ ప్రకంపనలతో వణికిపోతున్నది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలు అరెస్ట్ అయ్యారు. మరి కొంతమంది టీవీ నటులు, డ్యాన్సర్లు, కొంతమంది డ్రగ్ సరఫరా చేసే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు.

తాజాగా డ్రగ్స్ రాకెట్‌లో ఫేమస్ కన్నడ యాంకర్ అనుశ్రీ పేరు బయటకురావడం, అనుశ్రీకి పోలీసులు నోటీసులు పంపడం కలకలం సృష్టిస్తున్నది. ఇటీవల డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కిషోర్ శెట్టిని విచారించగా అనుశ్రీకి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తెలిపాడు.

అనుశ్రీ తో పాటు మరి కొంతమంది పేర్లను కూడా బయట పెట్టాడని సమాచారం. దీంతో ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. గతంలో కొన్ని పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు కిషోర్ చెప్పినట్లు తెలుస్తున్నది. ఊహించని విధంగా పాపులర్ యాంకర్ పేరు బయటకురావడంతో ఈ డ్రగ్స్‌ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

తమన్ కాపీ పై క్లారిటీ వచ్చింది గా..!!

అక్కినేని దంపతుల ఆస్థి విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..?

దాసరికి దేవి నాగవల్లి ఏమవుతుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -