Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కోసం గుడి.. ఎక్కడో తెలుస్తే షాకావుతారు

- Advertisement -

ఏ సినిమా పరిశ్రమలో అయిన స్టార్స్ ని దేవుళ్లను చేయడం కొత్తమీ కాదు. అలానే మన తెలుగులో కూడా అభిమానులు తన అభిమాన నటులను ఏంతగానో ప్రేమిస్తారు. తమ హృదయాలలో దేవుళ్లుగా కొలిస్తే తమిళనాట మాత్రం ఏకంగా గుడి కట్టే పూజిస్తారు. ఇప్పటికే ఆలా కొంతమంది స్టార్లకు గుడి కట్టిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడు. వరుస సక్సెస్‍లతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్నాడు ఎన్టీఆర్. టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ కు పక్క రాష్ట్రమైన కర్ణాటక గుడి కట్టబోతున్నారట. తెలుగు వాళ్లు అధికంగా ఉండే బళ్లారి ప్రాంతంలో ఎన్టీఆర్ కు దేవాలయం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎన్టీఆర్ కు, ఇటీవల ఈయన నటించిన లవకుశ’ కర్ణాటకలో అదరగొట్టింది.

రూ.15 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలో అక్కడి ఫ్యాన్స్ ఉత్సాహంతో జూనియర్ తారక్ రాముడికి గుడి కట్టేందుకు సిద్దమైపోతున్నారు. మరి కేవలం గుడి కట్టి వదిలేస్తారా.. లేక అందులో పూజలు పునస్కారాలు కూడా చేస్తారా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -